భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సుదిమళ్లలో తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందించిన రూ.1500 తపాలా శాఖ ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. పట్టణంలోని సింగరేణి పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల్లో ఈ పంపిణీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
డబ్బుల పంపిణీని ప్రారంభించిన హరిప్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుదిమళ్లలో తపాలా శాఖ ద్వారా రూ.1500ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు.
డబ్బుల పంపిణీని ప్రారంభించిన హరిప్రియ
ఇల్లందు, టేకులపల్లి మండలాల పరిధిలో దాదాపు 4 వేల మందికి తపాలా శాఖ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. పంపిణీని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పలువురు రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు.