భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, పెట్రోల్ బంక్‌లు, బస్టాండు ప్రాంతం నిర్మానుష్యంగా మారాయి. ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లలోకి పంపిస్తున్నారు.
జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా ఇల్లందు - janatha curfew
ఇల్లందులో జనతా కర్ఫ్యూ పట్ల ప్రజలు అవగాహనతో వ్యవహరించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజల అవగాహన పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా ఇల్లందు
పట్టణంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన భారీ వాహనాలను పోలీసులు శివారు ప్రాంతంలోనే నిలిపివేశారు. పోలీసులు గస్తీ తిరుగుతూ పర్యవేక్షించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు కూడా వెలవెలబోయాయి. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహనతో స్పందించడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.