భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ఇళ్లు నీటమునిగాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణం జలమయంగా మారింది. శేషగిరినగర్, సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్, బాపన కుంట గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆయా గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకనే వరద నీరు వచ్చి చేరిందని ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
మణుగూరులో భారీ వర్షం.. నీట మునిగిన ఇళ్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు ఇళ్లు నీటమునిగిపోయాయి.
నీట మునిగిన ఇళ్లు