తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhadradri temple news: రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ.. ఆలయంలో కార్తిక శోభ

భద్రాద్రి రామయ్య ఆలయంలో(Bhadradri temple news) సందడి నెలకొంది. కార్తిక మాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో వేకువజామునుంచే భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా కార్తిక వెలుగులతో కళకళలాడుతోంది.

Bhadradri temple news, seetha rama chandra swamy temple
భద్రాద్రి ఆలయం, శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం

By

Published : Nov 7, 2021, 11:55 AM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో(Bhadradri temple news) భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక మాసం... పైగా ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

పోటెత్తిన భక్తులు

పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి... స్వామివారి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. రామయ్య నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం వేకువజామునే ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు.

భద్రాద్రి ఆలయం, శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం

భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ భక్తజన సందోహంతో కళకళలాడుతున్నాయి. భక్తులు వెలిగించిన కార్తిక దీపాలు.. వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ కాంతులతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది.

కార్తిక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

ఇదీ చదవండి:Karthika Deepothsavam: ఆదిలాబాద్​లో ఆధ్యాత్మికం.. కన్నుల పండువగా కార్తిక దీపోత్సవం

ABOUT THE AUTHOR

...view details