భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాములను యువ తెలంగాణ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ దర్శించుకున్నారు. అన్ని నియోజకవర్గాలకు తిరుగుతూ ఓటరు నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. భద్రాద్రిలో ఆనాడు ఉన్న వైభవం ఈనాడు కనిపించడం లేదని అన్నారు. గతంలో భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అనే భావన ఉండేదని.. ఈనాడు అది కనిపించడం లేదని విమర్శించారు. భద్రాచలాన్ని పర్యాటక ప్రాంతంగా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారి ప్రయోజనాల కోసం భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు.
'దేవుళ్ల విషయంలోనూ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది'
దేవుళ్ల విషయంలోనూ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని యువ తెలంగాణ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. యాదాద్రిపై చూపుతున్న శ్రద్ధ భద్రాద్రిపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. భద్రాద్రి సీతారాములను ఆమె దర్శించుకున్నారు.
దేవుళ్ల విషయంలోనూ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, యాదాద్రిపై చూపుతున్న శ్రద్ధ భద్రాద్రిపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. భద్రాద్రి రామయ్యకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇచ్చే సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి తలదన్ని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సాధన ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని రాణి రుద్రమ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటే పట్టభద్రుల ఎన్నికల్లో యువతెలంగాణ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'భయపడేది లేదు... ప్రజల పక్షాన పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదు'