Bhadrachalam Sita Rama Kalyanam :భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి రోజు ఏడాదికి ఒకసారి వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి వసంతపక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ప్రకటించారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16న ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 17న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 18న మహా పట్టాభిషేకం వేడుకలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 9 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయని, ఏప్రిల్ 23 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు.
Sita Rama Kalyanam in 2024 :మరోవైపు శ్రీరామనవమి (Sri Rama Navami) సమీపిస్తున్న తరుణంలో ముత్యాల తలంబ్రాలను భక్తులకు అందించనున్నారు. దీని కోసం 175 క్వింటాళ్ల బియ్యాన్ని సిద్ధం చేస్తున్నారు. దాతలు వీటిని ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 300- 500 కిలోల ముత్యాలు సమకూర్చనున్నారు. శ్రీరామనవమికి 60 కౌంటర్లు ఏర్పాటు చేసి ముత్యాలు లేని తలంబ్రాలు అందించనున్నారు. మిగితా వాటిని పోస్టల్, ఆర్టీసీకార్గో ద్వారా భక్తులకు పంపిణీ చేయనున్నారు.