రైతుపై బ్యాంక్ సిబ్బంది దాడి.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరానికి చెందిన యువ రైతు అశోక్‌పై ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి దాడి చేశాడు. బాధిత రైతు తన తల్లిదండ్రులతో కలిసి తమ గోల్డ్ లోన్‌కు సంబంధించిన రూ.70 వేలను వడ్డీతో కలిపి చెల్లించారు. బాధిత కుటుంబానికి క్రాప్‌లోన్ కూడా ఉందని.. దానిని రెన్యూవల్ చేసుకుంటేనే బంగారం వెనక్కిస్తామని బ్యాంక్ సిబ్బంది బదులిచ్చారు. బంగారానికి, క్రాప్‌లోన్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించడంతో.. వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది.
బంగారం ఇమ్మంటే బూతులు తిట్టడమేంటి ?
క్రాప్‌లోన్ అంశానికి గోల్డ్లోన్కి సంబంధం ఏంటని.. తమ బంగారం వెంటనే ఇవ్వాలని కోరినప్పటికీ బ్యాంక్ సిబ్బంది దుర్భాషలాడారని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాంక్ ఉద్యోగి తమను దూషించి అనుచితంగా ప్రవర్తించి ఘర్షణకు దిగినట్లు వాపోయాడు.
దీనిపై బ్యాంక్ మేనేజర్ అంబయ్యను వివరణ అడగ్గా రూ.లక్షా నలభై రెండు వేల క్రాప్‌లోన్ పెండింగ్ ఉందని... వెంటనే రెన్యూవల్ చేసుకోమని కోరిన సమయంలో ఘర్షణ మొదలైందని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగిపై రైతు అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చూడండి : 'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'