భద్రాచలంలో ఘనంగా బాలోత్సవ కార్యక్రమం
కూచిపూడి, భరతనాట్యం, జానపద జాతీయ గీతాలకు సుమారు వెయ్యిమంది బాలికలు నాట్యం చేసి అలరించారు. భద్రాద్రిలోని రామయ్య సన్నిధిలో బెక్కంటి ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో బెక్కంటి ఛారిటబుల్ ట్రస్ట్ వారు బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకే నృత్య ప్రదర్శనను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. వేల సంఖ్యలో హాజరైన విద్యార్థులు కూడిపూడి, భరతనాట్యం, జానపద జాతీయ గీతాలకు నృత్యాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలతో భద్రాచల ప్రాంతం జనసందోహంగా మారింది.