బస్సులు, క్యాబులు నడకపోయినా పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లో ప్రైవేటు బస్సులు, వాహనాల యజమానులు ఆందోళనకు దిగారు. తొలుత ఆర్టీఏ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ప్రైవేటు వాహన యజమానుల రాస్తారోకో
వాహన పన్నులను మినహాయించాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఆర్టీఏ కార్యాలయం ఎదుట ప్రైవేటు బస్సులు, వాహనాల యజమానులు రాస్తారోకో నిర్వహించారు. కరోనా కారణంగా వెహికిల్స్ నడవక అనేక మంది సిబ్బంది రోడ్డున పడ్డామని తమని ఆదుకోవాలంటూ నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ప్రైవేటు వాహన యజమానుల రాస్తారోకో
కొవిడ్ కారణంగా గత ఆరునెలల నుంచి ఇప్పటివరకు వాహనాలు తిరగకున్నా పన్నులు వసూలు చేస్తున్నారని ఆసంఘం జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడవక యజమానులతో పాటు పనిచేసే డ్రైవర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారని వాపోయారు. ట్యాక్స్ రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:టాక్స్ నుంచి మినహాయించాలని టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుల ధర్నా