తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్​ చంద్రశేఖరరావు, జన్నారం డివిజనల్ అధికారి సిరిపురపు మాధవరావుకు అవార్డులు వరించాయి.

telangana forest officials got two Wildlife Photography Awards
జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

By

Published : Aug 30, 2020, 5:31 PM IST

వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా( డబ్ల్యూసీఎస్​) నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణకు రెండు అవార్డులు వరించాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ద్వితీయ, తృతీయ అవార్డులు పొందారు.

ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్​ చంద్రశేఖరరావు.. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటోకు రెండో స్థానం దక్కింది. జన్నారం డివిజనల్ అధికారి సిరిపురపు మాధవరావు.. కవ్వాల్ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫోటోకు ( క్రెస్టెడ్ హాక్ ఈగల్ ) మూడో స్థానం దక్కింది.

క్రెస్టెడ్ హాక్ ఈగల్
రాయల్ బెంగాల్ టైగర్

ఫోటోగ్రఫీ అవార్డులు సాధించిన ఇద్దరు అధికారులను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.

ఇవీచూడండి:గుంతలమయంగా హైదరాబాద్​ రోడ్లు.. వాహనదారుల పాట్లు

ABOUT THE AUTHOR

...view details