ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన సోయా చిక్కుడు విత్తనాన్ని రాయితీపై రైతులకు అందజేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎంపీపీ ప్రీతం రెడ్డి, గ్రామ సర్పంచ్ సునీత, వ్యవసాయ జిల్లా అధికారి శివకుమార్ చేతుల మీదుగా విత్తన పంపిణీ జరిగింది. 30కిలోల సోయా విత్తనం బస్తా రూ.1,845 రూపాయల విలువ ఉంటే రాయితీపై రూ.1095కు రైతులకు పంపిణీ చేస్తున్నారు. మండలానికి మూడు వేల బస్తాలు కేటాయించినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలను తీసుకువస్తే సోయా కూపన్లు అందజేస్తున్నట్లుగా వ్యవసాయ అధికారులు తెలిపారు.
రాయితీపై సోయా విత్తనాల పంపిణీ - seeds distribution
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై సోయా విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.
రాయితీపై సోయా విత్తనాల పంపిణీ