ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం వల్ల మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణ పరిధిలోని క్షౌరశాలల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయాలని సూచిస్తోంది.
ఆ పట్టణంలో నేటినుంచి ప్రతిరోజు క్షౌరశాలల్లో శానిటైజేషన్
ఆదిలాబాద్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటినుంచి పట్టణంలోని అన్ని క్షౌరశాలను శానిటైజేషన్ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.
ఆ పట్టణంలో నేటి నుంచి ప్రతిరోజు క్షౌరశాలల్లో శానిటైజేషన్!
ఇందులో భాగంగా క్షౌరశాలల్లో మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ మారుతీప్రసాద్ హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసి... శానిటైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇదీ చూడండి:'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'