తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేశారు. ఛలో ట్యాంక్​ బండ్​ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జీ చేశారని ఆరోపించారు.

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

By

Published : Nov 10, 2019, 2:08 PM IST

ఆదిలాబాద్​లో సుందరయ్య భవన్​ నుంచి ఆర్టీసీ డిపో వరకు కార్మికులు ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో డిపో ఎదుట నిరసన తెలిపారు. ఛలో ట్యాంక్​ బండ్​ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులపై విచక్షణరహితంగా పోలీసులు లాఠీచార్జీ చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఐకాస నేతలను వెంటనే చర్చలకు పిలవాలని ప్రభుత్వానికి డిమాండ్​ చేశారు.

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details