ఆదిలాబాద్ జిల్లా మన్యంలో కొంతవరకైన మూఢనమ్మకాలను తగ్గించాలనే సంకల్పంతో జిల్లా జనవిజ్ఞానవేదిక, ఆదివాసీ గిరిజన సంఘం సంయుక్తంగా ముందుకొచ్చాయి. ఆదిలాబాద్‌లో ఆదివాసీ యువతతో ప్రత్యేక విజ్ఞాన మేళను నిర్వహించింది. అనారోగ్యానికి, ఆరోగ్యానికి, సమాజంలో జరిగే మార్పులకు శాస్త్రీయ పరిణామాలే తప్ప... మంత్రాలు, తంత్రాలు కావని మ్యాజిక్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. వేళ్ల నుంచి ఉంగరాలు తీసేవాళ్లు, అరచేతి నుంచి విభూదిని సృష్టించడంలో అసలు కిటుకును వివరించే విధానాలను ఆదివాసీ యువతకు కళ్లకు కట్టేలా చూపించారు. శాస్త్ర విజ్ఞానంతోనే మార్పులు వస్తాయి తప్పా మూఢనమ్మకాలతో రావని వేదిక నేతలు స్పష్టం చేశారు.
మంత్రాల్లేవ్..తంత్రాల్లేవ్..ఆదివాసులకు అవగాహన
ఆదిలాబాద్ జిల్లా మన్యంలో మూఢనమ్మకాలను తగ్గించటానికి జనవిజ్ఞానవేదిక ముందుకొచ్చింది. మంత్రాలు, తంత్రాలు ద్వారా ఏమి జరగదని మ్యాజిక్ ద్వారా వివరించారు.
శాస్త్రీయతతోనే జీవితాల్లో మార్పు: జన విజ్ఞాన వేదిక