ఆదిలాబాద్ కలెక్టరేట్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాస్టర్ ట్రైనర్లు ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో విధులపై అవగాహన పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ తెలిపారు. ఎన్నికలు నిర్వహించటంలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమన్నారు.
సెక్టోరల్ అధికారులకు శిక్షణ
లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాల్లో అధికారులకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ కలెక్టరేట్లో సెక్టోరల్ అధికారులకు రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అధికారులకు పోలింగ్ విధులపై అవగాహన