ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో సమత కేసు డిశ్చార్జీ పిటిషన్‌పై విచారణ జరిగింది. న్యాయవాది రహీం వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. నిందితులపై ఊహాజనిత ఆధారాలతో కేసు నమోదు చేశారని రహీం పిటిషన్‌లో పేర్కొన్నారు. రహీం పిటిషన్‌కు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేశారు.
సమత కేసులో డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత - Discharge petition dismissed in Samata case
సమత కేసులో నిందితుల తరఫున న్యాయవాది వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు సోమవారం నుంచి సాక్షులను విచారించే అవకాశముంది.
సమత కేసులో డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జీ పిటిషన్ చెల్లదని కౌంటర్‌లో వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు...డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. కేసులో సోమవారం నుంచి సాక్షలను విచారించే అవకాశం ఉంది.
- ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం