'బాల్య వివాహాలు చేస్తే చట్టారిత్యా చర్యలు తప్పవు'
బాల్య వివాహాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. ఒకవేళ చేసినా ఆ పెళ్లిల్లు చెల్లవని ఆలయ పూజారులు, అర్చకులకు తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తి అవగాహన సదస్సు
ఆలయాల్లో పూజారులు, అర్చకులు బాల్యవివాహాలు చేయరాదని, అలా చేస్తే చట్టరిత్యా చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో అర్చకులు, పూజారులకు బాల్యవివాహాల నిరోధంపై అవగాహన కల్పించారు. పెళ్లి చేయమని కోరేవారికి వయసు ధ్రువీకరణ పత్రం చూపించాకే పెళ్లి చేయాలని స్పష్టం చేశారు. బాల్యవివాహాలు చేస్తే అవి చెల్లవని వెల్లడించారు.