అదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఉట్నూర్‌లో గల ఐఎంఎల్ డిపోలో తమకు హమాలీలుగా పని కల్పించాలని కోరుతూ డిపో ఎదుట ఆదివాసీ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్‌ను కలిసి, వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు 75 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందనే విషయాన్ని వారు గుర్తు చేశారు.
'ఐఎంఎల్ డిపోలో హమాలీలుగా ఆదివాసీలకు అవకాశం కల్పించాలి' - Utnoor IML depot latest news
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐఎంఎల్ డిపో నందు హమాలీలుగా తమకు అవకాశం కల్పించాలని ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. డిపో మేనేజర్‌కి వినతి పత్రం సమర్పించారు.
ఏజెన్సీ చట్టంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీలకు తప్పనిసరిగా ఐఎంఎల్ డిపోలో కూలీలుగా పని చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి సంబంధించి గతంలోనే ఐటీడీఏ పీవో, జిల్లా పాలనాధికారి, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించామని, అయినా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... ఆదివాసీలకు స్థానికంగా పని చేసుకునేలా అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. వారంరోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా నిరవధిక దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :పీసీసీ ఎస్సీ సెల్ నిరసన ర్యాలీ.. నేతల అరెస్టు