శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఓట్లేసిన వారంతా తెరాసకు వ్యతిరేక వర్గమేననే విషయం తమకు ముందే తెలుసున్నారు మాజీ మంత్రి జోగు రామన్న. మండలికి వచ్చిన ఫలితాలు రాబోయే ఎన్నికల్లో పునరావృతం కావని ఆయన స్పష్టం చేశారు. బరిలో నిల్చిన కాంగ్రెస్, భాజపా అభ్యర్థులకు ధరావతు సైతం రాదన్నారు. అయినా కాంగ్రెసే తమ ప్రత్యర్థి అంటున్నారు జోగు రామన్న.
ఆదిలాబాద్లో తెరాస గెలుపు ఖాయం: జోగు రామన్న - ex minister jogu ramanna
తెరాస శ్రేణుల్లో సఖ్యతలేదనే మాట అవాస్తమన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. మంత్రి కంటే కూడా ఎమ్మెల్యేగానే సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఎంపీ నగేష్ చేసిన అభివృద్ధి గతంలో ఏ ఎంపీ చేయలేదని రామన్న స్పష్టం చేశారు. నగేష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్లో తెరాస గెలుపు ఖాయం: జోగు రామన్న