ఎన్నో ఏళ్ల నుంచి ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసీ మహిళా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నిర్వహించిన ర్యాలీకి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు. కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి... ఐటీఐ వరకు ర్యాలీ చేపట్టారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీ గ్రామాల్లో మద్యం దుకాణాలు ఎత్తివేయాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని నాయకురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి ఆదివాసీల పోరాటం - aadivaasi protest in utnoor
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో... తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు ఐటీడీఏ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరికి గేటు తోసుకొని లోపలికి వెళ్లి... పీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ గోపికి వినతిపత్రం అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'