తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత క్రికెట్​కు ధోనీ చేసిన సేవ ఎనలేనిది: సచిన్​ - Mahendra Singh Dhoni

dhoni
ధోనీ వీడ్కోలు​ మ్యాచ్​ను నిర్వహించాలి: ఝార్ఖండ్​ సీఎం

By

Published : Aug 15, 2020, 8:50 PM IST

Updated : Aug 16, 2020, 12:36 AM IST

00:28 August 16

వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలి

ధోనీ కోసం వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలనే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్ ప్రతిపాదన అద్భుత ఆలోచన అని చెప్పారు మహీ చిన్ననాటి కోచ్​ చంచల్​ భట్టాచార్య. తాను కూడా బీసీసీఐకి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తానని అన్నారు.

22:58 August 15

కోట్లాది మంది యువత ధైర్యానికి చిహ్నం.. ధోనీ: ఎంపీ సీఎం

భారత క్రికెట్​ మాజీ సారథి ఎంఎస్​ ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన సందర్భంగా అతను చేసిన సేవలను కొనియాడారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. చిన్న పట్టణాల నుంచి వచ్చే కోట్లాది మంది యువత ధైర్యానికి ధోనీ ఓ చిహ్నమని పేర్కొన్నారు.  ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సిన ఒక విషయం ధోనీ జీవితం అని ట్వీట్​ చేశారు.  

22:49 August 15

భారత క్రికెట్​కు ధోనీ చేసిన సేవ ఎనలేనిది: సచిన్​

ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఎంఎస్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సచిన్​ తెందూల్కర్​.  భారత క్రికెట్​కు ధోనీ సహకారం ఎనలేనిదని పేర్కొన్నారు​. ధోనీతో కలిసి 2011 ప్రపంచకప్​ గెలవటం తన జీవితంలో గొప్ప క్షణమని పేర్కొన్నారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్న ధోనీ, ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని ఆకాంక్షించారు. 

22:12 August 15

'ధోనీ వీడ్కోలుతో క్రికెట్​లో ఓ శకం ముగిసింది'

భారత మాజీ సారథి ఎంఎస్​ ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలకటంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ధోనీ వీడ్కోలుతో క్రికెట్​లో ఓ శకం ముగిసిందన్నారు. దేశం, ప్రపంచ క్రికెట్​లో గొప్ప క్రికటర్​ అని కొనియాడారు. అతని నాయకత్వ లక్షణాలు ప్రత్యేకమని, ధోనీతో సరిపోలే వారు దొరకటం కష్టమని పేర్కొన్నారు. 

22:01 August 15

'భారత క్రికెట్​ కోసం ధోనీ తన సహకారాన్ని కొనసాగించాలి'

భారత క్రికెట్​ అభివృద్ధికోసం మహేంద్ర సింగ్​ ధోనీ  అసమానమైన కృషి చేశారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ధోనీకి కృతజ్ఞతలు తెలిపారు. ధోనీ రిటైర్​మెంట్​తో యావత్​ ప్రపంచం ఆయన హెలికాప్టర్​ షాట్​ను చూడలేకపోతుందని పేర్కొన్నారు.  

" భారత క్రికెట్​కు అసమానమైన కృషి చేసినందుకు ఎంఎస్​ ధోనీకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్రికెట్​ అభిమానులతో చేరుతున్నా. అతని శాంత స్వభావంతో భారత్​కు అనుకూలంగా అనేక ఫలితాలు వచ్చాయి. అతని సారథ్యంలో భారత్​ రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది." 

           - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.  

తనదైన శైలితో మిలియన్ల మంది క్రికెట్​ అబిమానులను మైమరిపంచారని కొనియాడారు షా. రానున్న రోజుల్లో భారత క్రికెట్​ను బలోపేతం చేసేందుకు ధోనీ సహకారం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన భవిష్యత్తు ప్రయాణం అంతా మంచే జరగాలని ఆంకాక్షించారు. 

21:48 August 15

'మంచి బ్యాట్స్​మెనే కాదు.. విజయవంతమైన సారథి కూడా'

ఎంఎస్​ ధోనీ మంచి బ్యాట్స్​మెన్​ మాత్రమే కాదని, విజయవంతమైన సారథి, ఆల్​రౌండర్​ అని పేర్కొన్నారు బీసీసీఐ మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​. భారత క్రికెట్​ కోసం ఎంతో చేశాడన్నారు. అతని అభిమానులకు దూరమైనప్పటికీ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్ల చెప్పారు. 

21:14 August 15

ధోనీ వీడ్కోలు​ మ్యాచ్​ను నిర్వహించాలి: ఝార్ఖండ్​ సీఎం

అంతర్జాతీయ క్రికెట్​కు భారత మాజీ సారథి ఎంఎస్​ ధోనీ వీడ్కోలు పలకటంపై స్పందించారు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​. ధోనీ కోసం వీడ్కోలు​ మ్యాచ్​ నిర్వహించాలని బీసీసీఐని కోరనున్నట్లు తెలిపారు. ఆ మ్యాచ్​కు ఝార్ఖండ్​ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

21:07 August 15

విజయవంతమైన సారథిగా రికార్డు సాధించిన ధోని

  • క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోనీ
  • అద్భుత ప్రతిభతో జట్టును అసమాన స్థాయికి తీసుకెళ్లిన ధోనీ
  • ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న ధోనీ
  • అత్యంత విజయవంతమైన సారథిగా రికార్డు సాధించిన ధోనీ
  • అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ను విజేతగా నిలిపిన ధోనీ
  • టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ స్థానానికి చేరిన ధోనీ
  • భారత్‌కు తొలి టీ-ట్వంటీ ప్రపంచకప్‌ (2007) అందించిన ధోనీ
  • ఫైనల్‌లో అద్భుత వ్యూహంతో పాకిస్తాన్‌పై విజయం
  • జోగీందర్‌ శర్మకు చివరి ఓవర్‌ ఇచ్చి చతురత ప్రదర్శించిన ధోనీ
  • వన్డేలు, టి-20ల్లో ఫీల్డింగ్‌ మోహరింపుల్లో నవ్యత చూపిన ధోనీ
  • టెయిలండర్ల సాయంతో అనేక వన్డేలు గెలిపించిన ధోనీ

20:44 August 15

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా

  • అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా
  • 2005 జులై 30న శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా
  • 2010 జులై 26న శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన రైనా
  • 2006 డిసెంబరు 1న దక్షిణాఫ్రికాపై టి-20 అరంగేట్రం చేసిన రైనా
  • 226 వన్డేల్లో 5,615 పరుగులు చేసిన సురేశ్‌ రైనా
  • 18 టెస్టుల్లో 768 పరుగులు చేసిన సురేశ్ రైనా
  • 78 టి-20 మ్యాచ్‌ల్లో 1,605 పరుగులు చేసిన రైనా

20:29 August 15

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, రైనా

  • అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎం.ఎస్‌.ధోనీ
  • 2004 డిసెంబరు 23న తొలి వన్డే మ్యాచ్‌ ఆడిన ధోనీ
  • వన్డేల్లో బంగ్లాదేశ్‌పై ఎం.ఎస్‌.ధోనీ అరంగేట్రం
  • 2005 డిసెంబరు 2న తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన ధోనీ
  • 2019 జులై 9న న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డే ఆడిన ధోనీ
  • కెరీర్‌లో 350 వన్డేలు ఆడిన ఎం.ఎస్‌.ధోనీ
  • వన్డేల్లో 10 శతకాలు, 73 అర్ధశతకాలు చేసిన ధోనీ
  • వన్డేల్లో 10,773 పరుగురు చేసిన ఎం.ఎస్‌.ధోనీ
  • వన్డేల్లో ధోనీ అత్యధిక స్కోరు 183 పరుగులు
  • కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన ఎం.ఎస్‌.ధోనీ
  • టెస్టుల్లో 6 శతకాలు, 33 అర్ధశతకాలు చేసిన ధోనీ
  • కెరీర్‌లో 98 టి-20 మ్యాచ్‌లు ఆడిన ఎం.ఎస్‌.ధోనీ
  • కెప్టెన్ కూల్‌, జార్ఖండ్ డైనమైట్‌గా ధోనీకి పేరు
  • వన్డేల్లో అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ
  • అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా ధోనీ రికార్డు
  • ధోనీ సారథ్యంలో 2007లో ఐసీసీ టి-20 ప్రపంచకప్ గెలిచిన భారత్‌
  • 2011లో ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్‌
  • ధోనీకి 2008, 2009 ఐసీసీ వన్డే ప్లేయర్ పురస్కారాలు
Last Updated : Aug 16, 2020, 12:36 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details