ఏడు సార్లు వింబుల్డన్ ఛాంపియన్ సెరెనా విలయమ్స్... 12వ సారి టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టింది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి అల్సిన్ రిస్కేతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌ను 6-4, 4-6, 6-3 పాయింట్ల తేడాతో చమటోడ్చి నెగ్గింది. సెమీఫైనల్లో జోహాన్నా కోంటా లేదా బర్బోరా స్ట్రైకోవాతో తలపడే అవకాశముంది.
"ఇది సంతృప్తికర విజయం. అల్సిన్.. అత్యుత్తమం ప్రదర్శన చేసే ఎంతోమందిని ఓడించింది. ఈ రోజు కొద్దిలో గెలుపును చేజార్చుకుంది." -సెరెనా విలియమ్స్, టెన్నిస్ క్రీడాకారిణి