ఐదో యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్.. తన కెరీర్లో 40వసారి ఈ టోర్నీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మారిన్ సిలిచ్(క్రొయేషియా)పై 6-3, 3-6, 6-1, 6-2 తేడాతో విజయం సాధించాడు.
నాదల్ క్వార్టర్స్‌కు.. ప్రపంచ నంబర్ వన్ ఇంటికి - జకోవిచ్
యూఎస్ ఓపెన్‌లో రఫెల్ నాదల్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. మహిళల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఒసాకా.. 13వ సీడ్ బెలిండా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రఫెల్ నాదల్
అంతకు ముందు ఆదివారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. ప్రీక్వార్టర్స్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా.. 13వ సీడ్ బెలిండా చేతిలో 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో వావ్రింకాతో మ్యాచ్‌లో భుజం గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు టాప్‌సీడ్ జకోవిచ్. గత ఐదు యూఎస్ ఓపెన్ టోర్నీల్లో నాలుగుసార్లు విజేతగా నిలిచాడీ స్టార్ ప్లేయర్.
ఇది చదవండి: అనితర సాధ్యుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ
Last Updated : Sep 29, 2019, 6:33 AM IST