ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఇంకా తగ్గడం లేదు. దీని ప్రభావం త్వరలో మొదలు కానున్న 'ఆస్ట్రేలియన్ ఓపెన్'పైనా పడింది. దాని నుంచి వస్తున్న పొగ వల్ల ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు అస్వస్థతకు గురయ్యారు. అయితే బాధితుల్ని ఆదుకునేందుకు టెన్నిస్ స్టార్ క్రీడాకారులు ఒక్కటయ్యారు. టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన వారిలో కొంతమంది, తమ వంతు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. 'ర్యాలీ ఫర్ రిలీఫ్' పేరుతో మ్యాచ్లు నిర్వహించారు. సుమారు 5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు పోగు చేశారు.
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు టెన్నిస్ స్టార్స్ సాయం - Rod Laver Arena
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితులకు తమ వంతు సాయం చేశారు ప్రముఖ టెన్నిస్ ప్లేయర్లు. 'ర్యాలీ ఫర్ రిలీఫ్' పేరుతో మ్యాచ్లు నిర్వహించి సుమారు 5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళమందించారు.
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు టెన్నిస్ స్టార్స్ సాయం
ఈ మ్యాచ్ల్లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా విలియమ్స్, నిక్ కిర్గియోస్, కరోలినా వోజ్నియాకి, అలెగ్జాండర్ జ్వెరేవ్ తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆస్ట్రేలియన్ ఓపెన్ తన ట్విట్టర్లో పంచుకుంది.
ఇవీ చదవండి: