ETV Bharat / international

​​​​​​​కార్చిచ్చు బాధితులకు ప్రవాస భారతీయుల సాయం - australia bushfire latest

యావత్​ ప్రపంచాన్నే కలచివేసిన ఆస్ట్రేలియా కార్చిచ్చు విపత్తు అంతకంతకు పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మరో సవాలుగా మారాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, భీకర గాలులతో మరిన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో బాధితులు, సహాయ సిబ్బందికి భారతీయ సిక్కులు స్వచ్ఛందంగా సేవలందిస్తూ.. మన్ననలు పొందుతున్నారు.

Outpouring of generosity from Australian Sikhs amid bushfire
​​​​​​​ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు ప్రవాస భారతీయుల సహాయం
author img

By

Published : Jan 9, 2020, 8:13 PM IST

ఆస్ట్రేలియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కార్చిచ్చు జ్వాలలు కోటిన్నర ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. వేలాది ఇళ్లు, భవనాలు దగ్ధమయ్యాయి. లక్షలాది మూగ జీవాలు నేలరాలిపోయాయి. దావానలం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

​​​​​​​ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు ప్రవాస భారతీయుల సహాయం
కార్చిచ్చును అదుపు చేసేందుకు 3వేలకు పైగా అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు అహర్నిశలు శ్రమిస్తున్నా అదుపులోకి రావటం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన బలగాలతో పాటు దేశీయ సిబ్బందితో.. విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు అధికారులు.

హెచ్చరికలు జారీ..

ప్రస్తుతం ఆగ్నేయ ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భీకర గాలుల వల్ల మరిన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విక్టోరియా రాష్ట్రంలో 23 చోట్ల మంటలు చెలరేగుతూనే ఉన్నాయని, పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వచ్చే 48 గంటల్లో జ్వాలలు తీవ్రంగా ఎగసిపడే ప్రమాదముందని ఆ రాష్ట్ర ఆత్యయిక స్థితి నిర్వహణా కమిషనర్ ఆండ్రూ క్రిస్ప్​ తెలిపారు. కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.

ఇప్పటికే కంగారూ ద్వీపంలోని పాండ్నా, న్యూ సౌత్​ వేల్స్ ప్రాంతాల్లోని ప్రజలు తక్షణమే వారి గృహాలను విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

కోలుకోవడానికి రెండేళ్లు...

దావానలం ధాటికి ఆహుతైన మౌలిక సదుపాయల పునర్నిర్మానానికి అదనంగా మరో 2 బిలియన్​ డాలర్లు కేటాయించింది ఆ దేశ ప్రభుత్వం. రాష్ట్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కనీసం రెండేళ్లు శ్రమించాల్సి ఉంటుందని అంచనా వేసింది.

ప్రధానిపై విమర్శలు..

2009లో కార్చిచ్చు ఇదే స్థాయిలో ఎగిసిపడింది.. ఆ ఘటనలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు.. అప్పట్లో భయంకర ఘట్టాన్ని 'బ్లాక్​ సాటర్​డే'గా పేర్కొన్నారు. సరిగ్గా పదేళ్లకు అలాంటి భీకర ప్రళయమే మళ్లీ వచ్చింది. అయితే.. కార్చిచ్చుపై నిమ్మకు నీరెత్తినట్లున్నారని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కార్చిచ్చు సహాయ చర్యలకు అదనంగా 9800 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

మానవత్వాన్ని చాటుతున్న సిక్కులు...

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితులకు సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నరు అక్కడి ప్రవాస భారతీయ సిక్కులు. న్యూ సౌత్​ వేల్స్​, విక్టోరియా రాష్ట్రాల్లో సహృదయాన్ని చాటుతూ.... భారత ఖ్యాతిని పెంచుతున్నారు.

బాధితులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయ కార్మికులకు గురుద్వారాలు, రెస్టారెంట్లలో.... ఉచిత భోజనం, వైద్య సహాయం, కిరాణా సామగ్రిని అందిస్తున్నారు. ఆస్ట్రేలియా సిక్కు స్వచ్ఛంద సేవకుల సంఘం, యునైటెడ్​ సిక్​, ఖాల్సా ప్లమ్​టన్​, టర్బన్స్​ ఫర్​ ఆస్ట్రేలియా వంటి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి సహాయక చర్యలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు భారతీయులు.

స్వచ్ఛంద సేవకుల్లో ఒకరైన సుఖ్విందర్​ కౌర్​ భారత్​కు వచ్చేందు సర్వం సిద్ధం చేసుకున్నాక తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని మరీ.. బాధితులకు ఆహారం అందిస్తూ.. సమాజమే మన కుటుంబమని ఎలుగెత్తి చాటుతున్నారు.

'కోమాలో ఉన్న మా అక్కను చూసేందుకు భారత్​కు బయల్దేరాను. కానీ, అదే సమయంలో ఈ విపత్తు వచ్చింది. అప్పుడే నిర్ణయించుకున్నా.. ఎన్నో ఏళ్లు నాకు నీడనిచ్చిన ఈ నేలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలను వదిలేసి వెళ్లిపోతే నేను మంచి మనిషిని మాత్రం కాలేను. వీరంతా నా కుటుంబమే కాబట్టి నాకూ బాధ్యత ఉంది. నా కుటుంబం ఇంత విపత్తులో ఉంటే వదిలి వెళ్లలేను."

- సుఖ్విందర్​ కౌర్​, ఆస్ట్రేలియా సిక్కు వాలంటరీ

సిక్కులు ఆస్ట్రేలియాలో చేస్తున్న సేవలపై భారత క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ఫేస్​బుక్​​లో స్పందించారు. వారిని మానవత్వానికి ప్రతీకలుగా నిర్వచించారు.

'ప్రకృతి ప్రళయంలో చిక్కుకున్న బాధితులకు సేవలందిస్తున్న ఆస్ట్రేలియా సిక్కులకు సాహో. వారి అడుగులు ప్రశంసనీయం, మానవత్వానికి నిదర్శనం. మనమంతా ఆస్ట్రేలియా కోసం ప్రార్థిద్దాం.. త్వరలో పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిద్దాం.'

-యువరాజ్​ సింగ్​, భారత క్రికెటర్​

53 ఏళ్లుగా సేవ..

విపత్తు వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు టోమెరాంగ్ రాష్ట్రానికి చెందిన డగ్​ షట్జ్​. 53 ఏళ్ల క్రితం కార్చిచ్చు దేశానికి కలుగజేసే నష్టాన్ని గమనించి స్వచ్ఛందంగా సేవలు ప్రారంభించాడు డగ్​ షట్జ్. అప్పుడు ఆయన వయసు 13 ఏళ్లు. 2001లో వచ్చిన విపత్తులో ఆయన వ్యాపారం కోల్పోయినా.. దిగులు చెంతకుండా తన సేవలను కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

ఇదీ చదవండి:నా జీవితాన్ని నాశనం చేసింది అతనే..!

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Thursday, 9 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0534: US NBR Awards AP Clients Only 4248401
Performances, Weinstein, Royals, and new Bond Writer Phoebe Waller-Bridge talk of NBR red carpet; Springsteen walks carpet with Scorsese
AP-APTN-0131: ARCHIVE Justin Bieber AP Clients Only 4248391
Justin Bieber says he's battling Lyme disease
AP-APTN-0044: US Underwater Content has significant restrictions, see script for details 4248368
Kristen Stewart says 'Underwater' suits were scary 'torture chambers'
AP-APTN-0038: UK Royals Reaction 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4248387
Reaction as Harry steps back from senior Royal duties
AP-APTN-0025: ARCHIVE Jussie Smollett AP Clients Only 4248385
Judge orders Google to turn over Jussie Smollett's emails
AP-APTN-2110: UK Royals AP Clients Only 4248373
Screengrabs of Meghan and Harry's announcement to step back from royal roles
AP-APTN-2108: UK Royals Reaction Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4248372
Royal commentator on Duke and Duchess statement
AP-APTN-2042: ARCHIVE UK Royals AP Clients Only 4248359
Prince Harry and his wife Meghan 'stepping back' as senior UK royals, will work to become financially independent
AP-APTN-2027: ARCHIVE Oscars AP Clients Only 4248366
Oscars to go host-less for 2nd straight year on ABC
AP-APTN-1928: US Weinstein Departure AP Clients Only 4248356
Second day of jury selection wraps in Weinstein's rape trial
AP-APTN-1924: ARCHIVE Modern Family AP Clients Only 4248355
ABC sets 'Modern Family' series finale for April 8
AP-APTN-1758: US Jeremy Sisto Content has significant restrictions, see script for details 4248293
Jeremy Sisto reflects on his career and talks season 2 of 'FBI'
AP-APTN-1526: Germany Nicki Minaj waxwork Content has significant restrictions, see script for details 4248306
Madame Tussauds Nicki Minaj wax figure leaves fans perplexed
AP-APTN-1510: US CE Florence Pugh AP Clients Only 4248302
How Florence Pugh stays sane: Hiking holidays with her gran.
AP-APTN-1504: UK CE BAFTA Rising Star Content has significant restrictions, see script for details 4248295
Micheal Ward and Jack Lowden - nominees for the EE BAFTA Rising Star Award - talk about their previous award experiences
AP-APTN-1446: US Weinstein arrival AP Clients Only 4248294
Weinstein arrives at courthouse for jury selection
AP-APTN-1353: S Korea Gaon Chart Music Awards AP Clients Only 4248284
K-pop stars walk the red carpet for the 9th Gaon Chart Music Awards
AP-APTN-1158: UK Bombay Bicycle Club Content has significant restrictions, see script for details 4248262
Bombay Bicycle Club look forward to international tour and release of new album, 'Everything Else Has Gone Wrong'
AP-APTN-0628: US NYFCC Awards AP Clients Only 4248179
Antonio Banderas admits he’s exhausted from long campaign as he collects NYFCC award for best actor
AP-APTN-0606: US Grammy Nashville AP Clients Only 4248187
For some Grammy nominees, smoke from Australian wildfires even looms over Nashville
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.