2021 సీజన్‌లో మొదటి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడు వారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. కరోనా, క్వారంటైన్ నిబంధనల కారణంగా ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఆరంభిస్తున్నట్లు టోర్నీ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ క్రీడాకారులకు చెప్పినట్లు తెలిసింది.
ఆలస్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్.. ఎప్పుడంటే?
కరోనా కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈసారి మూడు వారాల పాటు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 8న ఈ టోర్నీ ప్రారంభంకానున్నట్లు తెలిసింది.
"జనవరి 15 నుంచి రెండు వారాల పాటు క్రీడాకారులు క్వారంటైన్‌లో ఉండాలి. కొన్ని షరుతుల మధ్య క్వారంటైన్‌లో క్రీడాకారులు సాధన చేసుకునేందుకు విక్టోరియా ప్రభుత్వం అనుమతించింది" అని క్రీడాకారులకు పంపిన లేఖలో టైలీ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాల్ని టెన్నిస్ ఆస్ట్రేలియా ధ్రువీకరించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వహణకు తాము కట్టుబడి ఉన్నట్లు విక్టోరియా ప్రభుత్వాధినేత డానియెల్ ఆండ్రూస్ ఇటీవల ప్రకటించారు. ఒకవేళ ఈ గ్రాండ్‌స్లామ్ రద్దయితే మాత్రం టెన్నిస్ ఆస్ట్రేలియా సుమారు రూ.550 కోట్లు నష్టపోతుంది.
ఇదీ చూడండి :'ఆలస్యమైనా.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నిర్వహిస్తాం'