తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫెదరర్​ 'సెంచరీ'

దుబాయ్​ ఛాంపియన్​షిప్​ విజేతగా నిలిచాడు టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​.

దుబాయ్​ ఛాంపియన్​షిప్​ ట్రోఫీతో రోజర్​ ఫెదరర్​

By

Published : Mar 3, 2019, 5:59 AM IST

Updated : Mar 3, 2019, 1:44 PM IST

టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​ మరో ఘనత సాధించాడు. దుబాయ్​ టెన్నిస్ ఛాంపియన్​షిప్ పురుషుల సింగిల్స్​​ గెలిచి, కెరీర్​లో వందో టైటిల్​ను కైవసం చేసుకున్నాడు. టెన్నిస్​ చరిత్రలో ఈ రికార్డు సాధించిన రెండో ​ ఆటగాడిగా నిలిచాడు. ఫెదరర్​ కంటే ముందు అమెరికా టెన్నిస్​ దిగ్గజం జిమ్మి కానర్స్​ 109 టైటిళ్లు సాధించారు.

వందో టైటిల్​ సాధించిన టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​

అలవోక విజయం

దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​లో పదకొండో ర్యాంకు గ్రీస్​ యువఆటగాడు సిట్సిపాస్​పై అలవోకగా విజయం సాధించాడు ఫెదరర్​. 6-4,6-4 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు.

ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నాలుగో రౌండ్​లో సిట్సిపాస్​ చేతిలో ఫెదదర్​ ఓడాడు. ఇప్పుడు అదే ఆటగాడిపై గెలిచి, కెరీర్​లో మరో మైలురాయిని చేరుకున్నాడు ఈ స్విట్జర్లాండ్​ టెన్నిస్​ దిగ్గజం​.

దుబాయ్​ ఛాంపియన్​షిప్​ ట్రోఫీతో రోజర్​ ఫెదరర్​

100 టైటిళ్లు

టైటిళ్ల సంఖ్య టోర్నీలు
20 గ్రాండ్​స్లామ్​లు
6 ఇయర్​ ఎండ్ ఛాంపియన్​షిప్​లు
27 వరల్డ్​ టూర్​ ఏటీపీ మాస్టర్స్ -​ 1000
22 ఏటీపీ వరల్డ్​ టూర్​- 500
25 ఏటీపీ వరల్డ్​ టూర్ -​ 250
Last Updated : Mar 3, 2019, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details