టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ కుప్పకూలింది. రబాడా, నోర్జే నిప్పులు చెరిగే బంతులకు బంగ్లా బ్యాటర్లు విలవిలలాడిపోయారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లా 18.2 ఓవర్లలోనే ఆలౌటై.. 84 పరుగులు చేసింది. లిటన్ దాస్ (24), మెహదీ హసన్ (27) ఫర్వాలేదనిపించారు.
కుప్పకూలిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 85 - దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్లో 18.2 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో సఫారీ జట్టు ముందు 84 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలిపారు.
టీ20 ప్రపంచకప్
సఫారీ బౌలర్లలో రబాడా, నోర్జే మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. శాంసీ రెండు, ప్రిటోరియస్ ఒక వికెట్ పడగొట్టారు.