Wrestler Virender Singh: హరియాణాకు చెందిన దివ్యాంగ రెజ్లర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వీరేందర్ సింగ్‌కు ప్రభుత్వం రూ. కోటి 20 లక్షలు నగదు బహుమానం ఇచ్చిందని రాష్ట్ర స్పోర్ట్స్, యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పంకజ్ నైన్ తెలిపారు. ఈ నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. వీరేందర్ ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించలేదని వెల్లడించారు.
"వీరేందర్ సింగ్‌కు హరియాణా సర్కారు రూ. 1.20 కోట్లు అందజేసింది. క్రీడాశాఖలో అతడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే.. పారాలింపియన్స్తో పనిచేసేలా గ్రూప్ బీ స్థాయి ఉద్యోగం ఇస్తే అతడు స్వీకరించలేదు." అని పంకజ్ స్పష్టం చేశారు. వీరేందర్ డిమాండ్లకు సంబంధించి ఓ కమిటీ ఏర్పాటు చేసి పలు అంశాలపై ఆరా తీశామని తెలిపారు. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పించనుందని పేర్కొన్నారు.
మళ్లీ చర్చల్లోకి..
ఆదివారం, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఉద్దేశిస్తూ వీరేందర్ సింగ్ మరో ట్వీట్ చేశారు. 'ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు.. నేను పాకిస్థాన్ వాడినా?. కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు. నాకు అందరిలా సమాన హక్కులు ఎప్పుడు వర్తిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా అన్యాయం జరగనివ్వమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడేం జరుగుతోంది మరి.' అని వీరేందర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పంకజ్ నైన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
వీరేందర్ డిమాండ్?