తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Rapid Chess: మూడు మ్యాచ్​లు డ్రా.. హంపికి నిరాశ - కోనేరు హంపి చెస్

World Rapid Chess: ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్​షిప్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోనేరు హంపికి నిరాశ ఎదురైంది. టైటిల్​పై ఆశలతో బరిలోకి దిగిన హంపి ఆరో స్థానానికి పరిమితమైంది.

hampi
హంపి

By

Published : Dec 29, 2021, 9:15 AM IST

World Rapid Chess: ఫిడే ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన తెలుగు తేజం కోనేరు హంపి నిరాశాజనక ప్రదర్శన చేసింది. టైటిల్‌ నిలబెట్టుకోలేకపోవడమే కాదు.. కనీసం ఆమె టాప్‌-3లోనూ నిలవలేకపోయింది.

ఎనిమిదో రౌండు ముగిసేసరికి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచి టైటిల్‌పై ఆశలు రేపిన హంపి.. తర్వాతి మూడు గేముల్లో విజయాలు నమోదు చేయలేక పతకానికి దూరమైంది. చివరి మూడు రౌండ్లలో వరుసగా కోస్తెనిక్‌ అలెగ్జాండర్‌ (రష్యా), స్టెఫనోవా ఆంటోనెటా (బల్గేరియా), మమదోవా గుల్నార్‌ (అజర్‌బైజాన్‌)లతో గేమ్‌లను ఆమె డ్రాగా ముగించింది. మొత్తంగా హంపి 7.5 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. చివరగా 2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో హంపి విజేతగా నిలిచింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details