అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అధ్యక్షుడిగా థామస్ బాక్ తిరిగి ఎన్నికయ్యాడు. అతడు మరో నాలుగేళ్లు, అంటే 2025 వరకు పదవిలో ఉంటాడు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అతడు 93-1తో విజయం సాధించాడు.
ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్
థామస్ బాక్ మరోసారి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2025 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు బాక్. తాజాగా జరిగిన ఎన్నికల్లో 93-1 తేడాతో అతడు గెలుపొందాడు.
ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్
"నాపై ఇంత నమ్మకముంచిన సభ్యులకు నా కృతజ్ఞతలు" అని ఐఓసీ సభ్యుల ఆన్లైన్ సమావేశం సందర్భంగా బాక్ వ్యాఖ్యానించాడు. కరోనా కారణంగా ఆంక్షలు ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం జులై 23న ఆరంభమవుతాయని స్పష్టం చేశాడు.
ఇదీ చదవండి:టోక్యోనే నా చివరి ఒలింపిక్స్: మేరీ కోమ్