ప్రపచంలో జరిగే క్రీడల మెగా టోర్నీలో ఫిఫా వరల్డ్ కప్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కడున్నా మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ మెగా టోర్నీ ఫిపా వరల్డ్‌కప్ 2022 జరుగుతోంది. తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు ఎంతో మంది అభిమానులు తహతహలాడిపోతుంటారు. కానీ, ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు.
అందుకే టీవీ, కంప్యూటర్, మొబైల్.. తమకు అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా మ్యాచ్‌లన వీక్షిస్తుంటారు. మరి, విమానంలో ప్రయాణించే వారి పరిస్థితి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారంగా విమానయాన సంస్థలు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ఓ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ స్క్రీన్‌లలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది, అది ఏ విమానయాన సంస్థ అనే వివరాలను మాత్రం ప్రస్తావించలేదు.