దేశవ్యాప్తంగా ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority of India)తో పాటు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్(Indian Olympics Association)లు ముందుకొచ్చాయి. టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో భారత అథ్లెట్స్ పాల్గొననున్న నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి.
సాయ్, ఐఓఏ.. మెగా ఈవెంట్స్‌కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్ విజేతలకు సంబంధించి క్విజ్, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద పాత్ర పోషించనున్నాయి.