తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రీడా పురస్కారాల వేడుక రెండు నెలలు వాయిదా! - ఖేల్​రత్న అవార్డులు

జాతీయ క్రీడా పురస్కారాల వేడుక ఒకటి లేదా రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ అవార్డు వేడుకకు సంబంధించి రాష్ట్రపతి భవన్​ నుంచి క్రీడా మంత్రిత్వ శాఖకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ఓ అధికారి తెలిపారు.

క్రీడా పురస్కారాల వేడుక రెండు నెలలు వాయిదా!
క్రీడా పురస్కారాల వేడుక రెండు నెలలు వాయిదా!

By

Published : Jul 30, 2020, 1:07 PM IST

Updated : Jul 30, 2020, 2:02 PM IST

జాతీయ క్రీడా పురస్కారాల వేడుక ఒకటి లేదా రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. కరోనా నేపథ్యంలో వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట. రాష్ట్రపతి భవన్ నుంచి తుది నిర్ణయం వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

రాజీవ్ గాంధీ ఖేల్​రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్​చంద్ పురస్కారాలు ప్రతి ఏటా ఆగస్టు 29న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. హాకీ లెజెండ్ ధ్యాన్​చంద్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ వేడుక జరుపుతారు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది.

"ఈ అవార్డు వేడుకపై ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్​ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అందుకోసం ఎదురుచూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ప్రస్తుతం దేశంలో ప్రజలు గుంపుగా చేరే అవకాశం లేదు. అందువల్ల రాష్ట్రపతి భవన్​లో ఎలాంటి వేడుకలు జరిగే వీలు లేదు. ఒకవేళ వీలు కాకపోతే రెండు నెలల వరకు వాయిదే వేసే అవకాశం ఉంది."

-క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి

కరోనా కారణంగా ఈ అవార్డుల కోసం దరఖాస్తు తేదీని కూడా పెంచారు. అలాగే ఆటగాళ్లు వ్యక్తిగతంగా అప్లై చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ కారణంగా ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు మంత్రిత్వ శాఖ ఆ అప్లికేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను మొదలుపెట్టలేదు. ఇంకా నెల రోజుల సమయమే ఉన్న పరిస్థితుల్లో ఈ అవార్డు వేడుక కచ్చితంగా వాయిదా పడుతుందని మరో అధికారి వెల్లడించారు.

Last Updated : Jul 30, 2020, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details