తెలంగాణ

telangana

ETV Bharat / sports

గొడవల్లో రెజ్లర్ మృతిపై సుశీల్ కుమార్ క్లారిటీ - ఛత్రసాల్ స్టేడియం గొడవ

దిల్లీ ఛత్రసాల్ మైదానం సమీపంలో జరిగిన గొడవల్లో ఓ రెజ్లర్ చనిపోయాడు. ఈ కేసుతో సంబంధముందన్న కారణంగా ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చినట్లు తెలుస్తోంది.

Sushil Kumar
సుశీల్ కుమార్

By

Published : May 6, 2021, 9:20 AM IST

దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం దగ్గర జరిగిన గొడవల్లో ఓ రెజ్లర్​ మరణించాడు. ఈ కేసులో రెండుసార్లు ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ రెజ్లర్​సుశీల్ కుమార్​పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇతడితో పాటు మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

దిల్లీ ఛత్రసాల్ మైదానం దగ్గర రెండు రెజ్లర్ గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో 23 ఏళ్ల రెజ్లర్​ చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కుమార్, అజయ్, ప్రిన్స్, సోనూ, సాగర్, అమిత్​తో పాటు మరికొందరు ఈ ఘటనకు కారణమని పోలీసులు నిర్ధరించారు. వీరిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ గొడవతో సంబంధం ఉందన్న ఆరోపణలతో రెజ్లర్ సుశీల్ కుమార్​ పేరును ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది.

మాకు ఎలాంటి సంబంధం లేదు

ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు సుశీల్ కుమార్. ఛత్రసాల్ స్టేడియం దగ్గర జరిగిన గొడవల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశాడు. "వారు మా రెజర్లు కాదు. స్టేడియం పరిధిలోకి కొందరు వ్యక్తులు వచ్చి గొడవ పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ ఘటనలో స్టేడియానికి ఎలాంటి సంబంధం లేదు" అని వెల్లడించాడు సుశీల్.

2012లో భారత్​కు ఒలింపిక్స్​లో రజత పతకం అందించాడు సుశీల్. అంతకుముందు బీజింగ్ ఒలింపిక్స్​లో కాంస్యం సాధించాడు.​

ABOUT THE AUTHOR

...view details