భారత షూటర్, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనున్న దీపక్ కుమార్ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దిల్లీలో సోమవారం రాత్రి, అతడు బంధువుల వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంతకు ముందు 2018లోనూ దీపక్ కారులో ఉంచిన ఖరీదైన వస్తువుల్ని ఇలానే దొంగిలించారు.
భారత షూటర్ కారు చోరీ.. పట్టించుకోని పోలీసులు
ఓ వివాహానికి హాజరైన సమయంలో తన కారును ఎవరో దొంగిలించారని అన్నాడు షూటర్ దీపక్ కుమార్. అయితే ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పాడు.
తన కారు కనిపించకపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు దీపక్ కుమార్. ఒలింపిక్స్ గేమ్స్ ముందున్న దృష్ట్యా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించట్లేదని అన్నాడు. మెగాటోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పోటీపడనున్నాడీ షూటర్.
'దిల్లీలో త్వరలో జరిగే షూటింగ్ ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిచేందుకు ప్రయత్నిస్తాను. అయితే కారు దొంగతనం లాంటి విషయాలు నా ఏకాగ్రతను దెబ్బతీయలేవు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు?' -దీపక్ కుమార్, భారత షూటర్