భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అది ఆట మాత్రమే కాదు.. అంతకుమించి...! ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఎందరో ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. భారత బాక్సర్ నీరజ్ గోయత్ కూడా కోహ్లీసేనను స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపాడు. పాక్ సంతతికి చెందిన బ్రిటీష్ బాక్సర్ ఆమిర్ ఖాన్‌తో జరిగే పోరులో గెలిచి తీరుతానని స్పష్టం చేశాడు.
పాకిస్థాన్‌పై భారత్ గెలిచిన నాటి నుంచి ఆమిర్, నీరజ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నీరజ్‌పై గెలిచి పాక్ ఓటమికి బదులు తీర్చుకుంటానని ఆమిర్ శపథం చేశాడు. దీనిపై నీరజ్ స్పందిస్తూ.. "అలాగే కలలు కంటూ ఉండిపో.. నువ్వు నా విజయానికి, భారత గెలుపునకు సాక్ష్యంగా నిలుస్తావు" అంటూ బదులిచ్చాడు.
"జులై 12న జరిగే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. భారత బాక్సింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నా. ఆమిర్ ఖాన్ లాంటి బాక్సర్‌పై గెలిచి ఇండియా బాక్సింగ్‌కు గుర్తింపు తీసుకొస్తా".