భయానికి మరో ఉత్పత్తి తానేనని ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ అన్నాడు. దానిని తనకు ఓ కవచంలా ప్రకృతి ప్రసాదించిందని భావిస్తున్నట్లు చెప్పాడు.
"నేను భయానికి మరో ఉదాహరణను. హింసాత్మక, మాదకద్రవ్యాల లాంటి భయానక పరిస్థితుల మధ్య పుట్టినవారు నాలాగే భయానికి గల బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఎందుకంటే జీవితాంతం అలాంటి అనుభూతి పొందడం వల్ల మీరు దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, అది మనల్ని విడిచి వెళ్లదు. ఎవరు నమ్మినా, నమ్మక పోయినా మనతో పాటే ఉంటుంది"