2018 ఆసియా క్రీడల్లో గెలుచుకున్న బంగారు పతకాన్ని భారత స్ప్రింటర్ హిమదాస్, కరోనా యోధులకు అంకితమిచ్చింది. వైరస్ను వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది తదితరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.
కరోనా యోధులకు హిమాదాస్ స్వర్ణపతకం అంకితం
గత ఆసియా క్రీడల్లో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని కరోనా యోధులకు అంకితమివ్వనున్నట్లు తెలిపింది స్ప్రింటర్ హిమదాస్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
హిమదాస్
ప్రస్తుతం తమ భద్రత, ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, కరోనా యోధులకు తన బంగారు పతకాన్ని అంకితం చేయాలనుకుంటున్నానని తెలిపింది హిమాదాస్.