ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.1 ఇగా స్వైటెక్ విజేతగా నిలిచింది. పోలెండ్‌కు చెందిన స్వైటెక్.. ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై సునాయాసంగా గెలుపొందింది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడుతూ.. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్ ఈ పోరును కేవలం 70 నిమిషాల్లోనే ముగించడం విశేషం.
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మరోసారి స్వైటెక్ సొంతం - ఫ్రెంచ్ ఓపెన్ 2022
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ స్వైటెక్ సత్తా చాటింది. అమెరికాకు చెందిన కోకోగాఫ్ను ఓడించి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
స్వైటెక్
ఈ గెలుపుతో ఆమె రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే స్వైటెక్ ఖాతాలో.. 2020లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన తొలి పోలెండ్ సింగిల్స్ క్రీడాకారిణిగా రికార్డు ఉంది.
ఇదీ చూడండి :డబ్బు కోసమే అదంతా చేస్తున్నాను.. సిగ్గు పడట్లేదు: గంభీర్
Last Updated : Jun 4, 2022, 8:50 PM IST