Commonwealth Games Table tennis: కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత బృందం స్వర్ణం సాధించింది. హర్మీత్- సత్యన్ జంట సింగపూర్‌కు చెందిన యాంగ్ క్వీక్- యీ పాంగ్‌పై 3-1 తేడాతో గెలిచారు. దీంతో ఈ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కామన్వెల్త్ క్రీడల్లో మూడోసారి స్వర్ణం కైవసం చేసుకున్నట్టైంది. అయితే ఈ విజయంపై ఈ ఇద్దరు ప్లేయర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో ఈటీవీ భారత్‌కు సత్యన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అంటూ ఉబ్బితబ్బిబైపోయాడు.
Commonwealth games: 'మా విజయం.. వారిలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది'
Commonwealth Games Table tennis: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు భారత ప్లేయర్ సత్యన్. తన ఆనందాన్ని వ్యక్త పరచడానికి మాటలు రావట్లేదని చెప్పాడు. ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు మరిన్ని విషయాలను పంచుకున్నాడు.
"ఈ గెలుపు చెప్పలేనంత సంతోషానిచ్చింది. టైటిల్‌ను దక్కించుకోవడం ఎంతో మధురమైన విషయం. ఇది భారీ విజయం. ఆధిపత్య పోరులో నైజీరియాపై, ఆ తర్వాత సింగపూర్‌పై విజయం సాధించడం అద్భుతం. ఇవి మనందరికీ ఎంతో మధురమైన క్షణాలు. ముఖ్యంగా టేబుల్ టెన్నిస్‌కు కామన్వెల్త్ గేమ్స్ ఎంతో ప్రత్యేకం. విజయానికి సోపానం. మనం కామన్వెల్త్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాం. బలంగా నిలబడటం చాలా ముఖ్యం. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో రెండో సారి స్వర్ణం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం మొత్తం టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్‌లో ఎంతో విశ్వాసాన్ని నింపింది. భవిష్యత్‌లో ఈ క్రీడల్లో రావాలనుకునేవారికి స్ఫూర్తిగా నిలుస్తూ ఓ భారీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ప్రపంచవేదికపై మా ప్రదర్శన చూసి యంగ్‌స్టర్స్ మరింత మంచి ప్రదర్శన చేసేందుకు స్ఫూర్తి పొందుతారు" అని అన్నాడు.
ఇదీ చూడండి:Commonwealth games: లాన్ బౌల్స్ ఆట ఎలా ఆడతారో తెలుసా?