తెలంగాణ

telangana

ETV Bharat / sports

'షెడ్యూల్​ ప్రకారమే కామన్వెల్త్​ క్రీడలు' - బర్మింగ్​హామ్

2022 కామన్వెల్త్​ క్రీడలు ప్రణాళిక ప్రకారమే జరుగుతాయని తెలిపింది కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్). బర్మింగ్​హామ్​ కౌన్సిల్​ నేత ఇయాన్ వార్డ్​ ఇటీవల అనుమానం వ్యక్తం చేయగా.. ఈ మేరకు స్పష్టతనిచ్చింది సీజీఎఫ్​.

CGF confident 2022 CWG will happen despite "uncertainty" expressed by  leader
'కచ్చితంగా కామన్వెల్త్​ క్రీడలు నిర్వహిస్తాం'

By

Published : Jan 21, 2021, 8:43 PM IST

వచ్చే ఏడాది బర్మింగ్​హామ్​లో నిర్వహించ తలపెట్టిన కామన్వెల్త్​ క్రీడలు.. అనుకున్న సమయం ప్రకారం జరుగుతాయని కామన్వెల్త్​ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) విశ్వాసం వ్యక్తం చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్​ ఉద్ధృతి కారణంగా నిర్వహణపై ఏమీ చెప్పలేమని ఇటీవల అన్నారు ఆతిథ్య నగర​ కౌన్సిల్​ నేత ఇయాన్ వార్డ్​. దీంతో కార్యక్రమ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్​ ప్రకారమే జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పోటీలు జరుగుతాయని సీజీఎఫ్ సీఈఓ డేవిడ్ గ్రీవెంబర్గ్ స్పష్టతనిచ్చారు.

"ప్రణాళిక ప్రకారమే 2022 కామన్వెల్త్​ క్రీడలు జరుగుతాయని సీజీఎఫ్ విశ్వసిస్తోంది. అది కొవిడ్​ అనంతర ఐరోపాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా 18 నెలల సమయం ఉన్నందున మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అందుకోసం ప్రభుత్వంతో అన్ని స్థాయిల్లో, ఎన్జీవోలు, ఈవెంట్​ నిర్వాహకులతో కలిసి పనిచేస్తున్నాం. భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారు విధాన, వైద్య పరమైన సహకారం అందిస్తారు."

-డేవిడ్ గ్రీవెంబర్గ్, సీజీఎఫ్ సీఈఓ

వ్యాక్సినేషన్ సహ ఇతర నివారణ చర్యల ద్వారా పోటీల నిర్వహణ సాధ్యపడుతుందని గ్రీవెంబర్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అథ్లెట్ల భద్రత, ఆరోగ్యకర వాతావరణ కల్పన తమ ప్రాధాన్యమని చెప్పారు.

ఐరోపాలో ఇటీవల కొవిడ్​ స్ట్రెయిన్​ విజృంభించగా, కొద్దిరోజులుగా పరిస్థితి మెరుగవుతుంది. ప్రస్తుతం అక్కడ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వైరస్​ నేపథ్యంలోనే పోటీల నిర్వహణపై కచ్చితంగా చెప్పలేమని ఓ సమావేశంలో అన్నారు ఇయాన్ వార్డ్.

"భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. మరో కొత్త రకం వైరస్ ప్రబలవవచ్చు. ఒలింపిక్స్ నిర్వహణ​ కూడా సందిగ్ధంలో పడింది. అందుకే కామన్వెల్త్​ క్రీడలు జరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. కానీ బర్మింగ్​హామ్​ సహ ఐరోపా లబ్ధి దృష్ట్యా పోటీలు జరగాలని కోరుకుంటున్నా" అని వార్డ్ అన్నారు.

ఇదీ చూడండి:'కామన్వెల్త్​'​ గేమ్స్​లోని ఆ పోటీలు భారత్​లోనే

ABOUT THE AUTHOR

...view details