కరోనా కలకలం రేపినా ఆస్ట్రేలియన్ ఓపెన్ యథావిధిగా జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. హోటల్‌లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఏకంగా 160 మంది క్రీడాకారులు ఐసొలేషన్‌లోకి వెళ్లారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సన్నాహకంగా నిర్వహించాల్సిన ఆరు టోర్నీలను ఒకరోజు రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలా చేశామని టోర్నీ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ తెలిపాడు.
'యథావిధిగా ఆస్ట్రేలియన్ ఓపెన్'
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. హోటల్‌లో పనిచేసే వ్యక్తికి కరోనా సోకడం కారణంగా 160 మంది క్రీడాకారులు ఐసొలేషన్‌లోకి వెళ్లాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణపై నెలకొన్న అనుమానాలను తీర్చారు డైరెక్టర్ క్రెయిగ్ టైలీ.
'యథావిథిగా ఆస్ట్రేలియన్ ఓపెన్'
"ఆస్ట్రేలియన్ ఓపెన్ యథావిథిగా జరుగుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాం. సోమవారం టోర్నీ ప్రారంభమవుతుంది. తేదీల్ని మార్చాలన్న ఉద్దేశం మాకు లేదు. గురు, శుక్రవారాల్లో నిర్వహించే కరోనా పరీక్షలకు 160 మంది క్రీడాకారులు హాజరవుతారని అనుకుంటున్నా. శుక్రవారం మధ్యాహ్నం డ్రా వెలువడుతుంది." అని టైలీ చెప్పాడు.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్ ఓపెన్: 'సెట్ల ఫార్మాట్‌ను మార్చే ప్రసక్తే లేదు'