తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్ లోగోను చూశారా..?

2024లో పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లోగో విడుదలైంది. పారిస్​లో​ ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పారిస్​లో ఇప్పటివరకు రెండుసార్లు విశ్వక్రీడలు నిర్వహించారు.

2024 పారిస్ ఓలింపిక్స్ లోగో

By

Published : Oct 22, 2019, 9:43 AM IST

2024 పారిస్ ఒలింపిక్స్ లోగో విడుదల

2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలే ఇంకా పూర్తి కాలేదు.. 2024 విశ్వక్రీడల ప్రచారం మొదలైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్​ వేదికగా జరగనున్న ఈ ఒలింపిక్స్​ క్రీడల లోగోను విడుదల చేశారు. సోమవారం పారిస్​లో ఈ కార్యక్రమం జరిగింది. పారాలింపిక్స్ లోగోనూ ఇక్కడ ఆవిష్కరించారు.

బంగారు పతకం, ఒలింపిక్స్, పారాలింపిక్స్ జ్యోతి, మహిళ ముఖాన్ని ప్రతిబింబించేలా అమ్మాయి పెదవులతో ఈ ఒలింపిక్ చిహ్నాన్ని రూపొందించారు. ఈ మూడూ ఒకే గుర్తులో ఉండటం వల్ల ఈ లోగో మరింత ఆసక్తికరంగా మారింది.

పారిస్​లో ఇప్పటివరకు రెండు సార్లు విశ్వక్రీడలు నిర్వహించారు. 1900, 1924లో ఈ పోటీలు జరిగాయి. 2024లో మూడోసారి ఆతిథ్యమివ్వనుంది పారిస్. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: ఐపీఎల్​: రాజస్థాన్ కొత్త కోచ్​గా ఆసీస్ మాజీ క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details