తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​కు భారత హాకీ జట్టు.. రష్యాపై ఘనవిజయం

2020 టోక్యో ఒలింపిక్స్​కు భారత పురుషుల హాకీ జట్టు అర్హత సాధించింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్ రెండో మ్యాచ్​లో రష్యాపై 7-1 తేడాతో గెలిచి విశ్వక్రీడలకు వెళ్లనుంది.

భారత పురుషుల హాకీ జట్టు

By

Published : Nov 2, 2019, 11:15 PM IST

భారత హాకీ జట్టు వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్​కు అర్హ త సాధించింది. భువనేశ్వర్‌ వేదికగా శనివారం జరిగిన ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ రెండో మ్యాచ్‌లో రష్యాను 7-1 తేడాతో ఓడించి ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకుందిభారత్.

మ్యాచ్‌ ప్రారంభమైన తొలి నిమిషంలోనే రష్యా ఆటగాడు అలెక్సీ గోల్‌ కొట్టి భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. తొలి క్వార్టర్‌ ముగిసేసరికి మన్‌ప్రీత్ సేన 0-1తో వెనుకంజలో నిలిచింది. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభమైన కొద్దిసేపటికే హార్దిక్‌ (17వ నిమిషంలో) గోల్‌ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత భారత్‌ వెనుదిరిగి చూడలేదు. 23, 29వ నిమిషంలో అక్షదీప్ సింగ్‌‌ వరుస గోల్స్‌తో హోరెత్తించాడు. అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది.

భారత పురుషుల హాకీ జట్టు

అనంతరం 47వ నిమిషంలో నీలకంఠ శర్మ, 48వ నిమిషంలో రుపిందర్‌ సింగ్‌ గోల్స్‌ కొట్టడంతో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. ఆఖర్లో భారత్‌ మరింత పుంజుకొని రెండు గోల్స్‌ కొట్టి మ్యాచ్‌ను 7-1 తేడాతో ముగించింది. ఇదే వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌ మొదటి మ్యాచ్‌లో రష్యాను 4-2 తేడాతోమన్‌ప్రీత్ సేన ఓడించిన సంగతి తెలిసిందే.

మరోవైపు భారత మహిళా హాకీ జట్టు కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాతో జరిగిన మ్యాచ్​లో ఓడినప్పటికీ గోల్స్​ లెక్కలో(65) ముందంజలో ఉన్న భారత జట్టు ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది.

ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్​కు మహిళా హాకీ జట్టు అర్హత

ABOUT THE AUTHOR

...view details