తెలంగాణ

telangana

ETV Bharat / sports

దేశీయ మ్యాచ్​లపైనే దృష్టిపెట్టండి: అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్

ఈ ఏడాది తర్వాత జరిగే హాకీ సిరీస్​ ఈవెంట్స్​కు స్వస్తి పలకనుంది అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్​ఐహెచ్​). మార్చి 15,16 తేదీల్లో ఫెడరేషన్ అధ్యక్షుడు నరిందర్ బత్రా ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉపఖండ క్వాలిఫయర్స్​పైనే ప్రధానంగా జాతీయ జట్లు దృష్టి సారించనున్నాయి.

By

Published : Mar 20, 2019, 11:46 PM IST

హాకీ సిరీస్ ఈవెంట్

గతేడాది ప్రారంభమైన అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్​ఐహెచ్​) ప్రో లీగ్ విజయవంతమైంది. అయితే ఇది హాకీ సిరీస్​ ఈవెంట్స్​కు అడ్డంకిగా మారనుంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్, ప్రపంచకప్​ లాంటి పెద్ద టోర్నీలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవాళీ మ్యాచ్​లపై దృష్టి సారించాలని నిర్ణయించింది ఎఫ్​ఐహెచ్.

"ఎఫ్ఐహెచ్ సిరీస్ ఈవెంట్స్ 2019 తర్వాత ఆగిపోనున్నాయి. ఉపఖండ క్వాలిఫయర్స్, ఛాంపియన్​షిప్​పైనా జాతీయ జట్లు ప్రధానంగా దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం" -అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్

తర్వాతి ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జూన్28,29 తేదీల్లో ఆమ్​స్టర్​డామ్ వేదికగా జరగనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details