తెలంగాణ

telangana

Tweet Controversy: మోర్గాన్‌, మెక్‌ కలమ్‌పై కేకేఆర్​ నజర్​!

By

Published : Jun 10, 2021, 1:29 PM IST

జాతి వివక్షను అస్సలు సహించేది లేదని స్పష్టం చేసింది కోల్​కతా నైట్​రైడర్స్​ ఫ్రాంచైజీ(Kolkata Knight riders). నిజానిజాలు తెలిసిన తర్వాత జాత్యాహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోర్గాన్‌, మెక్‌ కలమ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

Eoin Morgan and Coach Brendon Mccullum
మోర్గాన్‌, మెక్‌ కలమ్‌

జాతి వివక్ష, జాతి విద్వేషాన్ని సహించే ప్రసక్తే లేదని ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight riders) ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనే ప్రసక్తి లేదని వెల్లడించింది. పూర్తి సమాచారం తెలిశాక ఇయాన్‌ మోర్గాన్‌(Eoin Morgan), బ్రెండన్‌ మెక్‌కలమ్‌ వ్యవహారంపై స్పందిస్తామని తెలిపింది.

భారతీయ యువ ఆటగాళ్లను కించపరుస్తూ మోర్గాన్‌, మెక్‌ కలమ్‌, జోస్‌ బట్లర్‌(Jos Buttler) చేసిన పాత ట్వీట్లు ప్రస్తుతం దుమారం రేపాయి. యువకుడిగా జాతి విద్వేష, స్త్రీవివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై కొత్త ఆటగాడు ఓలీ రాబిన్‌సన్‌ను ఈసీబీ సస్పెండ్‌ చేసింది. 2018లో 'సర్‌' అంటూ భారతీయులు యాస, భాషను ఎగతాళి చేస్తూ మోర్గాన్‌, బట్లర్ చేసిన ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. దాంతో వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ఈసీబీ వారిద్దరిని విచారిస్తోంది. ఈ క్రమంలోనే కేకేఆర్​ కూడా స్పందించింది.

తమకూ పూర్తి సమాచారం తెలియదని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ అన్నారు. "ఈ వ్యవహారంపై మాకింకా పూర్తి వివరాలు అందలేదు. ఏం జరిగిందో తెలియకుండా స్పందించడం సరికాదు. నిజానిజాలు తెలిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా నైట్‌రైడర్స్‌ జాతి వివక్షను అస్సలు సహించబోదని స్పష్టం చేస్తున్నా" అని ఆయన వెల్లడించారు.

"ఆటగాళ్ల విద్వేషపూరితమైన ట్వీట్లపై గతవారం మేం దృష్టి సారించాం. వారు గతంలో పోస్టు చేసిన వివక్షతతో కూడిన సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మా ఆటలో వివక్షకు తావులేదు. అవసరమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. నిజానిజాలు తెలుసుకుని వ్యవహరిస్తాం" అని ఇటీవల ఈసీబీ(ECB) ప్రకటించింది.

ఇదీ చూడండి: Tweet controversy: వివాదంలో మరో ఇద్దరు క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details