తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Finalలో శార్దూల్​ అదుర్స్​.. టాప్​ ఆర్డర్​కు స్ట్రాంగ్​ మెసేజ్​ ఇచ్చాడన్న దాదా! - shardul thakur

WTC Final 2023 Shardul Thakur : డబ్ల్యూటీసీ ఫైనల్​లో శార్దూల్ ఠాకూర్ ఇరగదీశాడు. టాప్​ ఆర్డర్ బ్యాటర్లు కనీసం కుదురుకోవడానికి ఇబ్బంది పడిన చోటునే శార్దూల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో శార్దూల్​ను గంగూలీ మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తేలిపోయిన టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్‌కు శార్దూల్ ఒక మెసేజ్ పంపాడని గంగూలీ అన్నాడు. ఈ పిచ్‌పై కొంచెం ఓపిక పడితే పరుగులు చేయొచ్చని నిరూపించాడని మెచుకున్నాడు.

WTC Final 2023 Shardul Thakur
WTC Final 2023 Shardul Thakur

By

Published : Jun 10, 2023, 3:30 PM IST

WTC Final 2023 Shardul Thakur : ఇంగ్లాండ్​లోని ఓవల్​ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో భారత జట్టు తడబడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియాకు బంతితో సరైన ఆరంభం దక్కలేదు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా టీమ్​ఇండియా టాప్​ఆర్డర్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు. ఇలాంటి సమయంలో జట్టును రహానే, శార్దూల్ ఆదుకున్నారు.

అజింక్య రహానే అయితే ఏకంగా 89 పరుగులు చేశాడు. అతడితోపాటు చక్కగా శార్దూల్ కూడా రాణించడంతో భారత జట్టు పుంజుకునేలాగే కనిపిస్తోంది. కేవలం 71 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయిన టీమ్​ఇండియా.. రహానే, శార్దూల్ పుణ్యమా అని కోలుకుంది. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా మాజీ లెజెండ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Shardul Thakur Sourav Ganguly :ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ కూడా చెక్కు చెదరకుండానే ఇరగదీశాడు. టాపార్డర్ బ్యాటర్లు కనీసం కుదురుకోవడానికి ఇబ్బంది పడిన చోటునే శార్దూల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన దాదా.. 'ఇంత మంచి ఇన్నింగ్స్ తర్వాత వాళ్లు డగౌట్ వైపు బ్యాటు చూపించారు. ఎందుకంటే కొంచెం కష్టపడి, లైట్‌గా అదృష్టం కలిసొస్తే మంచి స్కోర్లు చేయొచ్చు అని అక్కడున్న వాళ్లకు చెప్పడానికి' అని మెచ్చుకున్నాడు.

'ముఖ్యంగా రహానే అద్భుతంగా ఆడాడు. శార్దూల్ ఆరంభంలో కొన్ని దెబ్బలు తిన్నాడు. కానీ ఆ తర్వాత అద్భుతంగా రాణించాడు. గతంలో శార్దూల్ ఠాకూర్ విదేశాల్లో చక్కగా రాణించాడు. వీళ్లు రాణించడంతో భారత జట్టు కొంత మెరుగైన స్థితిలో నిలిచింది. హాఫ్ సెంచరీలు పూర్తయిన తర్వాత డగౌట్ వైపు వీళ్లు బ్యాటులు చూపించడం.. అక్కడి వెటరన్లకు మెసేజ్ ఇవ్వడానికే' అని గంగూలీ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తేలిపోయిన టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్‌కు శార్దూల్ ఒక మెసేజ్ పంపాడని గంగూలీ అన్నాడు. ఈ పిచ్‌పై కొంచెం ఓపిక పడితే పరుగులు చేయొచ్చని నిరూపించాడని మెచుకున్నాడు.

శార్దూల్​ అరుదైన ఘనత
అయితే ఈ మ్యాచ్​లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించాడు. ఓవల్‌ మైదానం వేదికపై వరుసగా మూడో అర్ధశతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌తోపాటు అలెన్‌ బోర్డర్ రికార్డును శార్దూల్‌ సమం చేశాడు. ఆసీస్‌పై 109 బంతుల్లో 51 పరుగులు చేసిన శార్దూల్‌కు ఓవల్‌ మైదానంలో మూడో హాఫ్‌ సెంచరీ. గతంలో 2021లో ఇంగ్లాండ్‌పై రెండు సార్లు, ఇప్పుడు ఆసీస్‌పై అర్ధశతకం సాధించాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌ (1930-1934), అలెన్‌ బోర్డర్‌ (1985-1989) మూడేసి హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై రాణించడంతో శార్దూల్‌పై నెట్టింట్‌ ప్రశంసలు కురుస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details