వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022) కోసం టీమ్‌ఇండియా ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో (New Zealand Tour of India) మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మరోవైపు గత టీ20 ప్రపంచకప్‌తో (T20 World Cup 2021) రవిశాస్త్రి కోచింగ్ బాధ్యతలు పూర్తవ్వగా.. మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో ఇటీవలే యూఏఈ నుంచి భారత్ చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. జైపూర్‌లో ఏకమయ్యారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid News) పర్యవేక్షణలో తొలిసారి ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం నూతన టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) త్రో బాల్స్ వేస్తూ కనిపించాడు. ఆ వీడియోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు, కొత్త ప్రారంభం అంటూ వ్యాఖ్యానించింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో రెండు అర్ధ శతకాలతో మెరిసిన రోహిత్ శర్మ నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేశాడు. సరైన టైమింగ్‌తో షాట్లు ఆడుతూ అందులో కనిపించాడు. మరోవైపు జైపూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమనే వార్తలు వినిపిస్తుండటం వల్ల హిట్‌మ్యాన్ రాబోయే సిరీస్‌లో ఎలా చెలరేగుతాడో చూడాలి.
రోహిత్‌తో ప్రశాంతత.. ద్రవిడ్‌తో సంస్కృతి
టీమ్ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో (Rahul Dravid Head Coach) కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు (KL Rahul News) వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ కొత్త నాయకత్వ బృందం.. మంచి జట్టు సంస్కృతిని నెలకొల్పుతుందని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ (KL Rahul Dravid), రోహిత్ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు రాహుల్.