తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఓపెనర్​గా కోహ్లీ కన్నా.. వారిద్దరిలో ఒకరు అయితే బాగుండేది' - కోహ్లీ ఓపెనింగ్‌పై జాఫర్ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయం కావడం వల్ల ఓపెనర్‌గా దిగలేకపోయాడు. దీంతో శిఖర్ ధావన్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చాడు. తాజాగా దీనిపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీ జాఫర్ పలు కీలక వ్యాఖ్యలతోపాటు సూచనలు చేశాడు.

wasim jaffer surprised
వసీ జాఫర్

By

Published : Dec 8, 2022, 10:19 PM IST

Wasim Jaffer Virat Kohli: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజార్చుకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయం కావడంతో ఓపెనర్‌గా దిగలేకపోయాడు. కానీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో రోహిత్‌కు బదులు శిఖర్ ధావన్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చాడు.

అయితే ఇద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీ జాఫర్ పలు కీలక వ్యాఖ్యలతోపాటు సూచనలు చేశాడు. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపించకుండా ఉండాల్సిందని, అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం ఇస్తే బాగుండేదని పేర్కొన్నాడు.

"రోహిత్ చేతికి గాయం కావడం.. ధావన్‌తో ఓపెనింగ్‌ ఎవరు చేయాలనే దానిపై కాస్త సందిగ్ధత ఏర్పడినట్లు ఉంది. దీంతో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే కోహ్లీకి బదులు కేఎల్ రాహుల్‌ కానీ, వాషింగ్టన్‌ సుందర్‌ కానీ బ్యాటింగ్‌కు వస్తే బాగుండేది. మరీ ముఖ్యంగా రాహుల్‌ అయితే ఇంకా బాగుండు. ఎందుకంటే ఇప్పటికే అతనికి ఇతర ఫార్మాట్లలోనూ ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. అలా కాకుండా మరొకరిని ఓపెనర్‌గా పంపిచాలని భావిస్తే వాషింగ్టన్‌ సుందర్‌ మంచి ఎంపిక. విరాట్ కోహ్లీ తప్పకుండా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి. శ్రేయస్‌ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్‌ ఐదో స్థానంలో వస్తే సరిపోయేది. కానీ విరాట్ ఓపెనర్‌గా వచ్చేసరికి కాస్త ఆశ్చర్యమనిపించింది. త్వరగా ఔట్‌ కావడం కూడా తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది" అని వసీం జాఫర్ వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details